వైసిపి నేతలను వెంటాడుతున్న భయం

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో

సమావేశంలో మాట్లాడుతున్న జవహర్‌

  • మాజీ మంత్రి ఎస్‌.జవహర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి వైసిపి నాయకులకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు ఎస్‌.జవహర్‌ అన్నారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల కష్టాలు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తెరచాటు పర్యటనలతో కాలం వెల్లబుచ్చారని విమర్శించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోసకారితనం బయటపడిందన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లోకేష్‌ యువగళం పాదయాత్రతో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల ఇన్‌ఛార్జీలను మార్చినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి రాలేరని తెలిపారు. వై నాట్‌ 175 అన్న జగన్‌ ఎందుకు ఇంతమందిని మారుస్తున్నారని ప్రశ్నించారు. యువగళం ముగింపు సభకు పెద్దసంఖ్యలో యువత, టిడిపి శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌, ఎస్‌సి సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

 

➡️