వైసిపి పాలనలో అవస్థలు

వైసిపి అరాచక పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే

మహిళతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

వైసిపి అరాచక పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని తిలారు పంచాయతీ గవిరమ్మపేట, రేగులపాడు పంచాయతీ పేటపాడు, ఎత్తురాళ్లపాడు పంచాయతీ పంతులపేట, ఎత్తురాళ్లుపాడు గ్రామాల్లో బుధవారం బాబు షూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాగానే బిసిలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామన్న హామీనిచ్చారు. ఐదేళ్ల వైసిపి పాలనలో అభివృద్ధికి 20 ఏళ్లు వెనుకబడ్డామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కింజరాపు హరివరప్రసాద్‌, బోయిన రమేష్‌, వెలమల కామేశ్వరావు, విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, పూజారి శైలజ, జనసేన నాయకులు పల్లి కోటేశ్వరరావు, పాగోటి అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. పలువురి చేరికకోటబొమ్మాళి టిడిపి కార్యాలయంలో వైపిపి నాయకులు టిడిపిలోకి చేశారు. వారికి అచ్చెన్నాయుడు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. టెక్కలి మండలం రాయివలస పంచాయతీకి చెందిన వార్డు మెంబర్‌ దాసరి రాము, నర్తు అమిస్‌ ఆయన అనుచర కుటుంబాలు చేరాయి. నరసన్నపేట : స్థానిj శివనగర్‌ కాలనీలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ జి.చిట్టిబాబు, రామారావు, వరదరాజు, కింజరాపు రామారావు పాల్గొన్నారు.

 

➡️