వైసిపి పాలనలో ప్రజాధనం లూటీ

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి

మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షులు రవికుమార్‌

  • టీటిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల ప్రజాధనం లూటీ చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ఆరోపించారు. జగన్‌ అవినీతి పాలనపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌ను స్వీకరించగలరా అని ప్రశ్నించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి హయాంలో రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తే, ఉన్న పరిశ్రమలను జగన్‌ అటకెక్కించారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామా ఆడిన జగన్‌, ఈసారి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని తెలిసి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాప్తాడు సభకు మందు, బిర్యానీ, డబ్బులు ఇచ్చి, బెదిరించి జనాలను తరలించారని, వాస్తవాలను ఫొటోలు తీస్తున్న ఫొటో జర్నలిస్టుపై దాడి చేయించారన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పేదలకు అమలు చేసిన 125 సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. ప్రజల పన్నుల భారాన్ని, నిత్యావసరాల ధరలు పెంచిన జగన్మోహనరెడ్డి అభివృద్ధి లేకుండా చేశారని విమర్శించారు. దీనివల్ల వృద్ధిరేటు గణనీయంగా తగ్గిందన్నారు. తలసరి ఆదాయం తగ్గడానికి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాద్యక్షులు పి.ఎం.జె బాబు, బి.భాస్కరరావు, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌, వి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️