వైసిపి విముక్త ఎపి లక్ష్యం

వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా

మాట్లాడుతున్న చంద్రమోహన్‌

  • జనసేన జిల్లా అధ్యక్షులు పి.చంద్రమోహన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పనిచేయాలని జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో జనసేన విస్తృత సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, గ్రామ, బూత్‌ కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైసిపి నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని, ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరన్నారు. కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో జనసేన పార్టీ సమన్వయకర్తలు విశ్వక్సేన్‌, గేదెల చైతన్య, ప్రవీణ్‌ కుమార్‌, ఎన్ని రాజు, పేడాడ రామ్మోహన్‌, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️