వైసిపి విస్తృత ప్రచారం

మండలంలోని తండేవలస, బెండివానిపేట గ్రామాల్లో వైసిపి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి

సోంపేట : ప్రచారం చేస్తున్న విజయ

ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌

మండలంలోని తండేవలస, బెండివానిపేట గ్రామాల్లో వైసిపి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అభివృద్ధిని చూసి ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ మాట్లాడుతూ చంద్రబాబు బతుకంతా వెన్నుపోట్లు, ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం, యూటర్న్‌ తీసుకోవడంతోనే సరిపోయిందని తిలక్‌ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పి.కూర్మారావు, యువనేత ధర్మాన రామ్‌ మనోహర్‌ నాయుడు, ఎంపిటిసి బెండు సంజీవరావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రణస్థలం: మండలంలోని సంచాం పంచాయతీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎచ్చెర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, వైస్‌ ఎంపిపిలు, మండల పార్టీ అధ్యక్షులు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.బూర్జ: మండలంలోని డొంకలపర్తలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి నాగు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసేవారికి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రామారావు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్‌ గోవిందరావు, సర్పంచ్‌ వి.ప్రభావతి, ఎంపిటిసి గుమ్మిడి రాంబాబు, వైస్‌ ఎంపిపిలు సూర్యారావు, కరణం కృష్ణం నాయుడు పాల్గొన్నారు. సోంపేట : మండలంలోని కొర్లాం పంచాయతీ హుకుంపేట, బ్రాహ్మణ కొర్లాం, నుకలూరు గ్రామాల్లో వైసిపిి ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి దాసు, ఎస్‌.భాస్కరరావు, బి.శ్రీకృష్ణ, ఆర్‌.విశ్వనాథం, పద్మమోహన్‌, టి.గణపతి, బి.పాపారావు, జి.కృష్ణారావు, ఎ.తిరుమల, కె.రమేష్‌ పాల్గొన్నారు. కొత్తూరు : కొత్తూరులోని బాపన వీధి, పెద్ద వీధుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి తనయుడు ఓంశ్రీకృష్ణ ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సారిపల్లి ప్రసాదరావు, సర్పంచ్‌ నాసా బాలకృష్ణ, ఎంపిటిసి లక్ష్మీనారాయణ, జి.ఆనందరావు, ఎల్‌.తిరుపతిరావు, ఎ.నాగేశ్వరరావు, బి.శ్రీను, పి.అశోక్‌, రాజులు పాల్గొన్నారు. మెళియాపుట్టి : రెడ్డి శాంతి, పి.తిలక్‌ గెలుపు కోసం జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరుకుమార్‌, కె.శశిభూషణరావులు మండలంలోని చింతపల్లిలో ప్రచారం నిర్వహించారు.

 

➡️