వ్యక్తిగత తోటల పెంపకంపై అవగాహన

ఉపాధి హామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో అంకితభావంతో విధులు నిర్వహించాలని తద్వారా నాణ్యమైన పనులు

సిబ్బందితో మాట్లాడుతున్న పీడీ చిట్టిరాజు

నరసన్నపేట:

ఉపాధి హామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో అంకితభావంతో విధులు నిర్వహించాలని తద్వారా నాణ్యమైన పనులు జరిగి సుస్థిర ఆస్తులు ఏర్పడతాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.వి.చిట్టిరాజు ఆకాంక్షించారు. మండలంలోని ఊర్లాం పంచాయతీ పరిధిలోని తోటల పెంపకం, గృహనిర్మాణ పనులు, చెరువులో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ వ్యక్తిగత తోటల పెంపకంపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రత్యేకం గా మునగ చెట్ల పెంపకానికి ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. అన్ని గ్రామాల్లోనూ ఉపాధి పనులు ప్రారంభించి నిర్దేశిత లక్ష్యాల మేరకు కూలీలకు ఉపాధిని కల్పించాలని ఆదేశించారు. కనీస కూలి కూలీలకు అందేవిధంగా కొలతలపై వారికి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. వంద రోజుల 10 దినాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధను చూపించాలన్నారు. కార్యక్రమంలో ఎపిఒ యుగం ధర్‌, ఇసి అప్పలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️