వ్యక్తిగత తోటల పెంపకానికి ప్రోత్సాహం

క్షేత్రస్థాయిలో భూములు ఉన్న జాబుకార్డులందరినీ వ్యక్తిగత తోటల పెంపకంపై ప్రోత్సహించడంతో పాటు వారిలో అవగాహనను కల్పించాలని

మాట్లాడుతున్న అశోక్‌కుమార్‌

  • గ్రామీణాభివృద్ధిశాఖ హార్టికల్చర్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

క్షేత్రస్థాయిలో భూములు ఉన్న జాబుకార్డులందరినీ వ్యక్తిగత తోటల పెంపకంపై ప్రోత్సహించడంతో పాటు వారిలో అవగాహనను కల్పించాలని గ్రామీణాభివృద్ధిశాఖ హార్టికల్చర్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ ఎం.అశోక్‌ కుమార్‌ సూచించారు. జిల్లా వెలుగు కార్యాలయంలో జిల్లా ఉపాధి హామీ, వెలుగు సిబ్బందితో సమన్వయ సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం చెరువులు, పంట కాలువల్లో పూడికతీత పనులే కాకుండా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే వివిధ రకాల పనులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ విషయమై సమన్వయం ఏర్పాటు చేసుకొని పరస్పరం సమాచారం ఇచ్చుకోవాలన్నారు. తోటల పెంపకం వల్ల రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అంతర పంటలూ అదనపు ఆదాయంగా ఉంటాయని అన్నారు. భూములు ఉన్న జాబ్‌ కార్డుదారుల సమాచారాన్ని సిబ్బంది తక్షణమే సేకరించాలని ఆదేశించారు. పథకం ప్రారంభం నుంచి కూలీల ఆర్థిక వృద్ధిలో ఎటువంటి పురోగతి లేదన్నది ప్రభుత్వాల అభిప్రాయంగా ఉందని తెలియజేశారు. మినీ గోకులాలు, ఫారం పాండ్స్‌, తదితర వ్యవసాయ రంగ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.వి.చిట్టిరాజు మాట్లాడుతూ జిల్లా, క్లస్టర్‌, మండల స్థాయిలో ఉపాధి హామీ, వెలుగు సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తామని అన్నారు. పంట పొలాల్లో పంట బావులు తవకంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. సమావే శంలో విజిలెన్స్‌ అధికారి బి.లవరాజు, ఫైనాన్స్‌ మేనేజర్‌ స్వరూపరాణి, ఎపిడిలు కె.లోకేష్‌, శైలజ, ప్లాంటేషన్‌ మేనేజర్‌ శ్యామల పాల్గొన్నారు.

 

➡️