‘సత్తారు’ విగ్రహావిష్కరణ

సమాస సేవ చేసే వారికి జనంలో గుర్తింపుని తీసుకొస్తాయ ని, అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ ఆదర్శప్రా యులని విశాఖపట్నానికి చెందిన క్రాంతి పిక్చర్స్‌ ఆధినేత నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక సుదర్శన థియేటర్‌ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే

విగ్రహాల వద్ద నివాళ్లర్పిస్తున్న ప్రముఖులు

ప్రజాశక్తి- టెక్కలి

సమాస సేవ చేసే వారికి జనంలో గుర్తింపుని తీసుకొస్తాయ ని, అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ ఆదర్శప్రా యులని విశాఖపట్నానికి చెందిన క్రాంతి పిక్చర్స్‌ ఆధినేత నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక సుదర్శన థియేటర్‌ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం నాయుడు, అన్నపూర్ణమ్మల విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు. రాజకీయాల్లో పలు పదవులు అలంకరించి టెక్కలి పట్టణ అభివృద్ధి లో లోకనాథం నాయుడు కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో లోకనాథం నాయుడు కుమారుడు, థియేటర్‌ యజమాని సత్తారు వెంకటరమణ, సుధారాణి, విశాఖ డెయిరీ మేనేజర్‌ చాపర విజయారావు, వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలల ఆధినేత బివిఎస్‌ఎన్‌ మూర్తి, చింతాడ గణపతి, సత్తారు సత్యం, సత్తారు ఉషారాణి, చింతాడ పార్వతీశం, వాకాడ నారాయణరావు, పొన్నాన జగన్మోహనరావు, తమ్మనగారి కిరణ్‌కుమార్‌, థియేటర్‌ మేనేజర్‌ బాలకృష్ణ, రామకృష్ణ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

 

➡️