సమగ్ర శిక్ష ఉద్యోగుల వంటావార్పు

రెగ్యులరైజ్‌ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి అధ్వర్యాన సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి పదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా స్థానిక జ్యోతిరావుపూలే పార్కు

వినతిపత్రం అందజేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రెగ్యులరైజ్‌ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి అధ్వర్యాన సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి పదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా స్థానిక జ్యోతిరావుపూలే పార్కు వద్ద ఉద్యోగులు వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌ సందర్శించి సంఘీబావం తెలిపారు. ఎంపీకి సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, పి.వాగ్దేవి, రవీంద్ర, ఫెడరేషన్‌ జెఎసి అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తవిటినాయుడు, కోశాధికారి డి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️