సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం

మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని చెప్పి చర్చల పేరుతో తాత్సారం చేస్తున్నారని, చర్చల విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం

శ్రీకాకుళం అర్బన్‌ : ఒంటికాళ్లపై నిరసన తెలియజేస్తున్న తేజేశ్వరరావు తదితరులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని చెప్పి చర్చల పేరుతో తాత్సారం చేస్తున్నారని, చర్చల విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం డిమాండ్‌ చేశారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ అన్న ఇచ్చిన హామీలు అమలుకు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికులంతా విధులు బహిష్కరించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన ధర్నా శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రదాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నగరపాలక సంస్థ, ఆముదలవలస, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో కార్మికులంతా సమ్మెలో బాగస్వాములై ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నామన్నారు. సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కోసం మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ను ఆప్కాస్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కళ్యాణ, రాజు, అర్‌.జి.రాము, ఎ.రాజేష్‌, టి.వెంకటలక్ష్మి, టి.మల్లమ్మ, జె.మాధవి, ఎ.మోహన్‌, డి.యుగంధర్‌, ఎ.మోహన్‌, డి.యుగంధర్‌, ఎం.నారాయణరావు, డి.సురేష్‌ కుమార్‌, ఎం.అప్పన్న పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందించారు. కనీస వేతనం అమలు చెయ్యాలని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని సిఐటియు కన్వీనర్‌ రమేష్‌ కుమార్‌ పట్నాయక్‌ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.ఆమదాలవలస: మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద కార్మికులు చేస్తున్న నిరవదిక సమ్మె శిబిరం వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎన్నికలకు ముందు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో రెగ్యులర్‌ చేసి సమాన పనికి సమానం వేతనం చెల్లిస్తామని, పర్మినెంట్‌ సిబ్బందికి సిపిఎస్‌ను వారం రోజుల్లోనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జనసేన సీనియర్‌ నాయకులు పాత్రుని పాపారావు, సరుబుజ్జిలి జనసేన మండలాధ్యక్షుడు పైడి మురళీమోహన్‌, జనసైనికులు కోటేశ్వరరావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

 

➡️