సమస్యలు పరిష్కరించే వరకు తగ్గేదేలే

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకూ తగ్గేదేలేదని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెకు పలు టిడిపి, పలు పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాల నుంచి

పలాస : ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకూ తగ్గేదేలేదని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెకు పలు టిడిపి, పలు పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. మరికొన్నిచోట్ల ర్యాలీలు చేపట్టారు. అలాగే పొందూరులో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇచ్ఛాపురంలో చేపట్టిన నిరవధిక సమ్మెకు ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, హైమవతి, విజయలక్ష్మి, జయ, టిడిపి నాయకులు కాళ్ల జయదేవ్‌, నందిక జాని, కొండ శంకర్‌రెడ్డి, ఢిల్లీరావు, కాళ్ల దిలీప్‌కుమార్‌, పి.తవిటయ్య, మహదేవ్‌రెడ్డి, ఆర్‌.జానకిరావు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె విఛ్చిన్నానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు ఆపి సిఎం జగన్‌ ఇచ్చిన హామీ నెరవేర్చాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఎచ్చెర్లలో అంగన్వాడీలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని తోటవీధి, గార ఐసిడిఎ ప్రాజెక్టుల వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెకు టిడిపి నాయకులు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ అంబటి లక్ష్మీరాజ్యం, పార్టీ నాయకులు రెడ్డిశంకర్‌, బోల్ల నాగేంద్ర యాదవ్‌, ఎఎంసి మాజీ చైర్మన్‌ మూకల్ల శ్రీను, సానివాడ సర్పంచ్‌ రుప్ప రమణమూర్తి పాల్గొన్నారు. నరసన్నపేటలో చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టి ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ సహాయ కార్యదర్శి శిరీష, అధ్యక్షులు డి.సరోజిని, ప్రధాన కార్యదర్శి పట్ట భాగ్యలక్ష్మి, సిఐటియు సీనియర్‌ నాయకులు ఆర్‌.సురేష్‌ బాబు, పోలాకి మండల కమిటీ కన్వీనర్‌ కాల నర్సింహులు పాల్గొన్నారు.బూర్జలోని చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కళ్లకు నల్లరిబ్బన్లతో గంతలు కట్టి వినూత్నంగా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి, రాధిక, సంతోషి, లక్ష్మి, సరస్వతి, శారద, రాజశ్రీ, రమణమ్మ, కళాశతి పాల్గొన్నారు. టెక్కలిలో అంగన్వాడీ కేంద్రాలపై సచివాలయం సిబ్బందితో చేపడుతున్న పనులను నిలుపుదల చేయాలని కార్యకర్తలు తహశీల్దార్‌ ప్రవళ్లికాప్రియను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నంబూరు షణ్ముఖరావు, కుప్పిలి కామేశ్వరరావు, ఎసిసిటియు నాయకులు శ్రీను, ప్రాజెక్టు నాయకులు ఆర్‌.ఆదిలక్ష్మి, సిహెస్‌.ఇందుమతి, వాణిశ్రీ, శ్రీదేవి, శ్యామల, ప్రభ, అరుణ, ఉష, కె.అన్నపూర్ణ, మల్లేశ్వరి, కృష్ణవేణి, పద్మావతి, వనజాక్షి పాల్గొన్నారు. ఆమదాలవలస ఐసిడిఎస్‌ ప్రాజెక్టు చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మెలో అంగన్వాడీ జిల్లా మెంబర్‌ పంచాది లతాదేవి, యూనియన్‌ నాయకులు పి.భూలక్ష్మి పి.లక్ష్మి, కనకం అరుణకుమారి పాల్గొన్నారు. ముందుగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. పలాసలో నిరవధిక సమ్మెలో భాగంగా ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌, కెటి రోడ్డు, శ్రీనివాస లాడ్జి, డిగ్రీ కళాశాల రోడ్డు, ఎంపిడిఒ కార్యాలయం మీదుగా ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు, సమ్మెకు జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరుకుమార్‌, పుక్కల గురయ్య, బైపల్లి రామకృష్ణ, ఎపి ఎన్‌జిఒ సంఘం నాయకులు బోనెల గోపాల్‌, బి.ఓంకార్‌, శ్రీనివాసరావు, పిఒడబ్ల్యు జిల్లా కార్యదర్శి పోతనపల్లి కుసుమ, కృష్ణవేణి, ఎఐసిసిటియు నాయకులు దున్న శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.మెళియాపుట్టిలో నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు పాతపట్నం మెయిన్‌ రోడ్డులో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, పాతపట్నం ప్రాజెక్టు నాయకులు బి.శాంతామణి, యు.ఉషారాణి, డి.లలిత, కె.నారాయణమ్మ, కె.సావిత్రి, పి.కళావతి పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో చేపట్టిన నిరవధిక సమ్మెకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, మండల టిడిపి అధ్యక్షుడు బోయిన రమేష్‌, జనసేన నాయకులు పల్లి కోటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుయువత మహిళా అధ్యక్షులు పూజారి శైలజ, మాజీ ఎంపిపిలు తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో కేంద్రాలు తాళాలు పగలుగొట్టి కేంద్రాలు తెరిపించడం వల్ల అధికారులే ఇళ్లకు పోతారని సిఐటియు జిల్లా నాయకులు హనుమంతు ఈశ్వరరావు హెచ్చరించారు. కోటబొమ్మాళి అంగన్వాడీ నిరసన శిభిరంలో పాల్గొని మాట్లాడారు. పొందూరు మండలంలోని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పర్యటనకు వచ్చారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యాన కార్యకర్తలు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం అంగన్వాడీల సెంటర్ల తాళాలు బద్దలు కొట్టించడం సరైంది కాదని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉంది.అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు వివిధ రకాల యాప్‌లు తెచ్చారని, ఫోన్లు పని చేయడం లేదని, ఎటువంటి శిక్షణా ఇవ్వలేదని అన్నారు. ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో నెట్‌ సిగల్‌ ఉండటం లేదని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల అంగన్వాడీలు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో అంగన్వాడీ యూనియన్‌ నాయుకులు జ్యోతి, లక్ష్మి, కృష్ణవేణి, రమ, లక్ష్మి పాల్గొన్నారు. అలాగే మండలంలోని బురిడికంచరాం, లోలుగు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోని సరుకులను స్టాక్‌ను ఇన్‌ఛార్జి సూపర్‌వైజర్‌ లీలారాణి, సచివాలయం సిబ్బంది పరిశీలించారు. కవిటి సచివాలయం -1, కె.కండ్రవీధిలోని అంగన్వాడీ కేంద్రాలల్లోని స్టాక్‌ను ఇఒ వీరభద్రస్వామి, విఆర్‌ఒలు నారాయణ, ప్రశాంతి, అంగన్వాడీ సూపర్‌ వైజర్లు పల్లవి, లక్ష్మి, వాలంటీర్లు పరిశీలించారు.

 

➡️