సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని

శ్రీకాకుళం అర్బన్‌ : నిరసన తెలుపుతున్న ఎపి జెఎసి నాయకులు

భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన

శ్రీకాకుళం అర్బన్‌:

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ హనుమంతు సాయిరాం విమర్శించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ ఎపి జెఎసి ఆధ్వర్యాన ఉద్యోగులు గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పిఆర్‌సిలో 30శాతం ఫిట్‌మెంటు వెంటనే ప్రకటించాలని, సిపిఎస్‌, జిపిఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు డిఎలను వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్‌ వారికి డిఎ బకాయిలు 90 శాతం నగదు రూపంలో చెల్లించాలన్నారు. 11వ పిఆర్‌సిలో ఇప్పటికీ ఎరియర్స్‌, సరెండర్‌ లీవ్‌ బకాయిలు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ క్లయిమ్‌లు వెంటనే చెల్లించాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో ప్రవేశపెట్టిన అప్రెంటిషిప్‌ను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలన్నారు. గురుకులాలు, సొసైటీ లు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, గతంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత కింద కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌జిఒ అసోసియేషన్‌ నాయకులు బి. పూర్ణచంద్రరావు, ట్రెజరీ ఉద్యోగులు పాల్గొన్నారు. మెళియాపుట్టి : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరా మం సమయంలో నిరసన చేపట్టారు. ఉద్యోగుల డిఎలు, ఐఆర్‌, పిఆర్‌సి బకాయిలు, ఎరియర్స్‌ సమ స్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనం తరం డిప్యూటీ తహశీల్దార్‌ టి.శంకరరావుకు వినతి పత్రం అందజేశారు. ఆర్‌ఐ వైకుంఠరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణారావు, అన్నాజీరావు, రమణ, హిమగిరి, మాధవ్‌, విఆర్‌ఒలు పాల్గొన్నారు.టెక్కలి : పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సయమంలో నిరసన తెలిపారు. టెక్కలి సబ్‌ ట్రెజరీ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలు కార్యాలయాల ఉద్యోగులు నిరసన తెలిపారు.

 

➡️