సమావేశానికి గైర్హాజరైన అధికారులకు నోటీసులు

స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్‌ అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి హజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని మండల

మాట్లాడుతున్న ఎంపిపి ఉమ

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్‌ అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి హజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని మండల పరిషత్‌ అధ్యక్షులు రోణంకి ఉమామల్లేశ్వరరావు, సభ్యులు కలిసి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ మూడు నెలలకోసారి జరిగిన సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం పనులు ఉన్నాయని చెప్పి హజరు కావటంలేదని, ప్రతీ సమావేశానికి ఇలాగే చెబుతున్నారని, హజరుకాని అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని తీర్మానించామన్నారు. అలాగే ధాన్యం రైస్‌మిల్లుకు తీసుకు వెళ్ళిన తరువాత కుంటుసాకులు చెప్పి రైస్‌మిల్లు యాజమాన్యం బస్తాకు మూడు కిలోలనుంచి ఐదు కిలోల వరకు ఎక్కువ తీసుకుంటున్నారని సిఎస్‌డిటి కె.రాముకు సభ్యులు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పోరేషన్‌ డ్రైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, మేజరు పంచాయతీ సర్పంచ్‌ కాళ్ళ సంజీవరావు, ఎంఇఒ ఎల్‌వి.ప్రతాప్‌, ఆర్‌అండ్‌బి జెఇ సరోజ, విద్యుత్‌శాఖ ఎఇ సురేష్‌, పంచాయతీ రాజ్‌, అర్‌డబ్ల్యూఎస్‌ ఎఇలు, శ్రీలత, కావ్యశ్రీ, మండల విప్‌ బొడ్డు అప్పన్న, నూక సత్యరాజ్‌, పేడాడ వెంకటరావు, కేశవరావు, మెట్ట సింహాచలం, బమ్మిడి గణపతి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

 

 

➡️