సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర

అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇటువంటి బెదిరింపులకు భయపడబోమని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, సిఐటియు కోశాధికారి

ఇచ్ఛాపురం : సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు

రెండో రోజూ కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇటువంటి బెదిరింపులకు భయపడబోమని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, సిఐటియు కోశాధికారి అల్లు సత్యం తేల్చిచెప్పారు. నగరంలోని అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రెండో రోజూ బుధవారం నిరవధిక సమ్మె శిబిరం కొనసాగించారు. ఈ శిబిరంలో పాల్గొని వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకూ సమ్మె కొనసాగతుందని స్పష్టం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 ఇవ్వాలు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని తీర్పునిచ్చిందన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. ఉద్యోగోన్నతి బెపిఫిట్‌ రూ.5 లక్షలకు పెంచాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరాన్ని సందర్శించి ఇఫ్టు నాయకురాలు జి.కృష్ణవేణి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు జిల్లా నాయకులు కె.ప్రమీల, టి.రాజేశ్వరి, బి.సరస్వతిదేవి, ఇ.అప్పలనరసమ్మ, ఎం.నాగపద్మ, జి.రాజేశ్వరి, ఎస్‌.దమయంతి, లీలా రత్నకుమారి, డి.జ్యోతి, సిహెచ్‌.అరుణ, కృష్ణ, భారతి పాల్గొన్నారు.పొందూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నరవధిక సమ్మెలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు, యూనియన్‌ నాయకులు జ్యోతిలక్ష్మి, రమ, నాగరత్నం, కృష్ణవేణి పాల్గొన్నారు. ఎచ్చెర్లలో చేపట్టిన అంగన్వాడీ నిరవధిక సమ్మెలకు యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎస్‌.కిషక్షర్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, వై.విజయలక్ష్మి, శారద, కనకం, సరస్వతి పాల్గొన్నారు.టెక్కలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెలో సిఐటియు జిల్లా నాయకులు నంబూరు షణ్ముఖరావు, హెచ్‌.ఈశ్వరరావు, శ్రీను, ప్రాజెక్టు నాయకులు ఆర్‌.ఆదిలక్ష్మి, సిహెస్‌.ఇందుమతి, వాణిశ్రీ, శ్రీదేవి, శ్యామల, ప్రభ, అరుణ, ఉష, కె.అన్నపూర్ణ, మల్లేశ్వరి, కృష్ణవేణి, వనజాక్షి పాల్గొన్నారు. నరసన్నపేట ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, టి.సరోజిని, ఎం.భాగ్యలక్ష్మి, టి.అమరావతి, డి.సులోచన పాల్గొన్నారు. శిబిరాన్ని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.వైకుంఠరావు, మండల ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ మద్దతు తెలిపారు. ఆమదాలవలస ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పి.భూ లక్ష్మి, ఎం.లత, పి.లక్ష్మి, కనకం అరుణకుమారి పాల్గొన్నారు. ఇచ్ఛాపురం బస్టాండ్‌ కూడలి వద్ద నిర్వహించిన నిరవధిక సమ్మెలో సిఐటియు జిల్లా కార్యదర్శి సంగారు లక్ష్మీనారాయణరావు, హైమావతి, బాలమణి, జయ, ఉమ, పుణ్య, విజయలక్ష్మి, కోమలి, సురేఖ పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెలో సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు, గొండు నీలన్న, దుంపల సుదర్శన పాల్గొన్నారు. కొత్తూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రజని, కె.లక్ష్మి, హేమలత, బోదెమ్మ, ప్రజా సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్‌ పాల్గొన్నారు. కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు, సిపిఎం నాయకులు బమ్మిడి ఆనందరావు, పిఒడబ్ల్యు జిల్లా కార్యదర్శి పి.కుసుమ, కె.హైమావతి, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వినోద్‌కుమార్‌, ఎఐకెఎం జిల్లా కార్యదర్శి మద్ధిలి రామారావు, ఐఎఫ్నాటియు నాయకులు జి.వీరాస్వామి, ఎఐటియుసి జిల్లా నాయకులు సిహెచ్‌.వెంకటరమణ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, ప్రాజెక్టు కన్వీనర్‌ సునీత, యూనియన్‌ నాయకులు ఆర్‌.అప్పలనరసమ్మ, ఆర్‌.భవాని, పి.గన్నెమ్మ, ఎం.కరుణ, బి.నిర్మల, ఎం.తులసి, పి.కళ్యాణి, పి.పద్మావతి, పార్వతి పాల్గొన్నారు.

➡️