సాంస్కృతిక కార్యక్రమాలతో నిరసన

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ

శ్రీకాకుళం అర్బన్‌ : థింసా నృత్యం చేస్తున్న అంగన్వాడీలు

  • 21వ రోజుకు అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి – శ్రీకాకుళం యంత్రాంగం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె పతాకస్థాయికి చేరింది. సోమవారానికి సమ్మె 21వ రోజుకు చేరుకోగా, సమ్మెలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటాపాటా, కబడ్డీ ఆడుతూ ఇతర రూపాల్లో సమ్మె శిబిరాల్లో నిరసనలు తెలిపారు. శ్రీకాకుళం అర్బన్‌ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు థింసా నృత్యం చేస్తూ అనంతరం కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. వేషధారణలో ఉన్న అంగన్వాడీ కార్యకర్త జోస్యం చెప్తుండగా, తమ సమస్యల పరిష్కారంపై అంగన్వాడీలు ఆమెను కొంగు చాచి అడుగుతున్న తీరు ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కళ్యాణి, నాయకులు కె.సంధ్య, అప్పలనరసమ్మ, లీల, నాగపద్మ తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో సమ్మె శిబిరంలో ఆటాపాట నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.రమణమ్మ, బి.ఆదిలక్ష్మి, సిహెచ్‌.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో సమ్మె ప్రత్యేక బుక్‌లెట్స్‌ను సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు శారద, కనకం, లలిత తదితరులు పాల్గొన్నారు. కొత్తూరులో మోకాళ్లపై నిల్చొని మొక్కుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిర్ల ప్రసాద్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జలజాక్షి, ధనలక్ష్మి, మధుబాల తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో అంగన్వాడీల సమ్మెకు ఎపిటిఎఫ్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హైమ, విజయలక్ష్మి, బాలమణి తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో సమ్మె శిబిరంలో అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కారక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.శాంతామణి, రాణి, కళావతి తదితరులు పాల్గొన్నారు. పలాసలో సమ్మెకు మద్దతుగా ఎఐసిసిటియు నాయకులు బి.వాసుదేవరావు, సిపిఎం నాయకులు బమ్మిడి ఆనందరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.మంజుల, బి.సునీత, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సోంపేటలో అంగన్వాడీల సమ్మెకు యుటిఎఫ్‌ నాయకులు జి.రమేష్‌, గుంట కోదండరావు, ఆర్‌.పరమేశ్వరరావు తదితరులు సంఘీభావం తెలిపి రూ.ఐదు వేల ఆర్థికసాయం అందజేశారు. ఆమదాలవలసలో సిడిపిఒ కార్యాలయానికి వచ్చిన బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద ఆగి వారి వద్దకు వచ్చారు. అంగన్వాడీల జీతాలు పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కోరామని తెలిపారు. అంగన్వాడీలకు నూతన శుభాకాంక్షలు తెలియజేసి సిడిపిఒ కార్యాలయానికి వెళ్లారు.

 

➡️