సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

వంశధార నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న నిధులు మంజూరు చేసినందుకు వైసిపి జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో శనివారం మెట్టూరు బిట్‌-2 గ్రామలైన మెట్టూరు బిట్‌-1, మెట్టూరు బిట్‌-2, మెట్టూరు బిట్‌-3, గూనభద్ర, గూనభద్ర ఆర్‌ఆర్‌

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న నిర్వాసితులు

ప్రజాశక్తి- కొత్తూరు

వంశధార నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న నిధులు మంజూరు చేసినందుకు వైసిపి జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో శనివారం మెట్టూరు బిట్‌-2 గ్రామలైన మెట్టూరు బిట్‌-1, మెట్టూరు బిట్‌-2, మెట్టూరు బిట్‌-3, గూనభద్ర, గూనభద్ర ఆర్‌ఆర్‌ తదితర నిర్వాసిత గ్రామాల నిర్వాసిత నాయకులు, మహిళలు, సిఎం జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టిడిపి ప్రభుత్వం నిర్వాసితులకు ఎంతో అన్యాయం చేసినప్పటికీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు అండగా ఉంటూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులను మోసం చేసిన టిడిపి ప్రభుత్వమని, చలికాలంలో కూడా గ్రామాలు ఖాళీ చేయించారని ఆయన అన్నారు. కార్యక్రమంలో వంశధార నిర్వాసిత నాయకులు కొయిలాపు సంజీవరావు, పెదకోట సంజీవ రావు, పెదకోట శ్రీరాములు, బర్రి రాజారావు, గవర ఉమా మాస్టారు, బుడ్డ రామకృష్ణ, బూడిద శాంతారావు, చంద్రరావు, బర్రి వెంకట్రావు, గొర్లి రామినాయుడు, చందర్రావు, బూడిద బంగారి, అశోక్‌, ధర్మాన చంటి పాల్గొన్నారు. వంశధార నిర్వాసితులకు పెండింగ్‌ నిధులు సిఎం జగన్మోహన్‌ రెడ్డిచే మంజూరు చేసినందుకు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని గూనభద్ర ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్వాసితులు దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. అలాగే మెట్టూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సిఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సారిపల్లి ప్రసాదరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు సూర్యనారాయణ, సర్పంచ్‌లు పేదకోట సాధుబాబు, వై.ధర్మారావు, కె.వైకుంటారావు, గజేంద్ర, జి.ఆనందరావు, ఎల్‌.తిరుపతిరావు, బి.శ్రీను, పంకాజ్‌ దాస్‌ పాల్గొన్నారు.

 

➡️