సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

సికిల్‌ సెల్‌ ఎనిమియ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని గుత్తావల్లి పిహెచ్‌సి వైద్యాధికారి రమ్యశ్రీ అన్నారు. సోమవారం గుత్తావల్లి పిహెచ్‌సి పరిధి

బూర్జ : వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారి రమ్యశ్రీ

ప్రజాశక్తి- బూర్జ

సికిల్‌ సెల్‌ ఎనిమియ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని గుత్తావల్లి పిహెచ్‌సి వైద్యాధికారి రమ్యశ్రీ అన్నారు. సోమవారం గుత్తావల్లి పిహెచ్‌సి పరిధి అన్నంపేట పంచాయతీలో మాసానపుట్టి, జంగాలపాడు, జివిపేట, అడ్డూరిపేట గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మందికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. 12 మందికి సికిల్‌ సెల్‌ ఎనిమియ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సికిల్‌ సెల్‌ ఎనిమియ వ్యాధిపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. రక్త హీనత, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఇటువంటి లక్షణాలు కలిగి వుంటే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి వారి సలహాపై మందులను స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌ పి.నవీన, సిహెచ్‌ఒలు పద్మావతి, మురళి, హెల్త్‌ అసిస్టెంట్లు వెంకట అప్పలనాయుడు, విక్రమ్‌, రాజులమ్మ, సరోజిని, ఎఎన్‌ఎంలు రమాదేవి, పుష్ప, అప్పలనాయుడు పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరు: పశువు ల్లో వచ్చే సీజనల్‌ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్య అధికారి పృథ్వీరాజ్‌ అన్నారు. మండలంలోని గరుడుభద్ర పంచాయతీ మర్రిపాడులో సర్పంచ్‌ గూడ గిరిజ, ప్రతినిధి ఈశ్వరరావు ఆధ్వర్యాన పాడి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను సోమవారం వేశారు. పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో పాడి రైతులు జి.ధనరాజు, కె.హేమసుందర్‌, కె.వాసుదేవ్‌, కె.రాజు, ఎం.రాజులు పాల్గొన్నారు.

 

➡️