సీనియర్‌ సహాయకులకు ఉద్యోగోన్నతి

జిల్లా పరిషత్‌ యాజమాన్యం పరిధిలో పనిచేస్తున్న పలువురు సీనియర్‌ సహాయకులకు పరిపాలనాధికారులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ శనివారం అందజేశారు. ఇచ్ఛాపురం పిఆర్‌ఐ

నియామకపు పత్రాన్ని అందజేస్తున్న విజయ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లా పరిషత్‌ యాజమాన్యం పరిధిలో పనిచేస్తున్న పలువురు సీనియర్‌ సహాయకులకు పరిపాలనాధికారులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ శనివారం అందజేశారు. ఇచ్ఛాపురం పిఆర్‌ఐ సబ్‌ డివిజన్‌, సీనియర్‌ సహాయకులుగా పనిచేస్తున్న జ్యోతిలక్ష్మి పాణిగ్రాహి, రణస్థలం ఆర్‌డబ్ల్యుఎస్‌ అండ్‌ ఎస్‌ సబ్‌డివిజన్‌ సీనియర్‌ సహాయకులుగా పనిచేస్తున్న ఎల్‌.నాగేశ్వరరావులకు పరిపాలనాధికారులుగా డ్వామాలో నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బూర్జ మండలం గుత్తావల్లి జెడ్‌పి హైస్కూల్‌ రికార్డు అసిస్టెంట్‌ ఎస్‌.శ్రీనివాసరావు కుమారుడు ఎస్‌.రాజేష్‌కు టైపిస్టుగా కవిటి మండల పరిషత్‌ కార్యాలయంలో నియమిస్తూ నియామకపు పత్రాలను అందజేశారు.

 

➡️