సెప్టిక్‌ట్యాంక్‌ వాహనం ప్రారంభం

మహిళలకు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఆనందాయకమని పలాస మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు అన్నారు. పలాసలో పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఎస్‌సి కార్పొరేషన్‌ ఆధ్వర్యాన జాతీయ సఫాయి కర్మచారీ ఫైనాన్షియల్‌ డెవలప్‌మెంట్‌ కింద

వాహనాన్ని ప్రారంభిస్తున్న చైర్మన్‌ గిరిబాబు

పలాస : మహిళలకు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఆనందాయకమని పలాస మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు అన్నారు. పలాసలో పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఎస్‌సి కార్పొరేషన్‌ ఆధ్వర్యాన జాతీయ సఫాయి కర్మచారీ ఫైనాన్షియల్‌ డెవలప్‌మెంట్‌ కింద రూ.32 లక్షల విలువ కలిగిన సెప్టిక్‌ ట్యాంక్‌ వాహనాన్ని సోమవారం ప్రారంభించారు. రూ.15 లక్షల వరకు రాయితీ ఉంటుందని, రూ.16 లక్షల వరకు లబ్ధిదారునికి రుణం ద్వారా వాహనం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పలాసకు మాత్రమే అవకాశం వచ్చిందని, ప్రజలకు చక్కని సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో బిసి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.గెడ్డమ్మ, కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, బి.సంతోష్‌కుమార్‌, సఫాయి మహిళా సంఘం సభ్యులు ఎ.వరలక్ష్మి, పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు.

 

➡️