స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు

దళ్లవలసలో ఇంటింటికీ కుళాయిలకు శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ సీతారాం

  • స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి – పొందూరు

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేయడమే తన లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం మండలం కనిమెట్ట, రాందాసుపురం, దళ్లవలస గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా కొళాయిల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల తాగునీటి అవసరాన్ని గుర్తించి జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి పనులు ముమ్మరంగా సిఎం జగన్మోహన్‌ రెడ్డి చేపడుతున్నారని పేర్కొన్నారు. రామదాసుపురంలో రూ.26.70 లక్షలు, కనిమెట్టలో రూ.1.20 కోట్లు, దల్లవలసలో రూ.85లక్షల నిధులతో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు బాడాన సునీల్‌, వైస్‌ ఎంపిపి ప్రతినిధులు కాకర్ల రాజారావు, వండాన సూరపు నాయుడు, సర్పంచ్‌లు లక్ష్మి, రమణ, ఎంపిటిసి, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కిల్లాన సూర్యారావు పాల్గొన్నారు.

 

 

➡️