హామీలు అమలు చేయాల్సిందే

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు

లేబర్‌ కోడ్లు రద్దు చేయాలి

శ్రీ కార్మిక, రైతు, ప్రజాసంఘాల డిమాండ్‌

శ్రీ ‘చలో ఢిల్లీ’కి మద్దతుగా నిరసనలు

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యాన రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా గురువారం జిల్లా వ్యాప్తంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని డైమండ్‌ పార్కు నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ ఢిల్లీలో ఫిబ్రవరి నుంచి వివిధ రూపాల్లో రైతులు నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎరువుల సబ్సిడీలో, ఆహార భద్రత చట్టం అమలుకు నిధుల్లో కోత విధించడంతోపాటు కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్‌ కంపెనీల హస్తగతం చేయడానికి కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు కూడా అలాగే ఉన్నాయన్నారు. మరోవైపు దశాబ్దాల పాటు కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్లు తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, 300 రోజుల పని దినాలు కల్పించి, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపిని ఇంటికి సాగనంపి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు, కో-కన్వీనర్‌ ఎం.గోవర్థనరావు, వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పి.చందర్రావు, ఎన్‌.బలరాం, గురుస్వామి, టి.నందోడు, సీతారాం, వై.గోపాలుడు, ఎల్‌.అశోక్‌, ఆర్‌.బోడమ్మ, ఆర్‌.అప్పాయమ్మ, ఎ.రాజేశ్వరి, బి.చంద్రశేఖర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.రణస్థలం : రణస్థలంలోని రామతీర్థం జంక్షన్‌ వద్ద సిఐటియు, ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌ : రైతులకు మద్దతుగా టెక్కలిలో సిపిఎం, కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నంభూరు షణ్ముఖరావు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ నాయకులు కోత మధు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు హెచ్‌ ఈశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు పొట్నూరు ఆనందరావు, కోట శంకర ప్రసాద్‌ రెడ్డి,దాట్ల లింగమూర్తి, వెంకట్రావులు సిపిఎం నాయకులు కొల్లి ఎల్లయ్య, పాళిన సాంబమూర్తి, వాకాడ ధనుంజయరావు, బగాది వాసుదేవరావు, ఎస్‌.ధర్మారావు, నొక్కు గౌరమ్మ పాల్గొన్నారు.జి.సిగడాం : జి.సిగడాం మండల కేంద్రంలో ఎపి కౌలు రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు, నాయకులు ఎస్‌.జగదీశ్వరరావు, రేగాన శివుడు, రెడ్డి గన్నెరాజు, వై.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.నరసన్నపేట : మండలంలోని పెద్దకరగాం గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్‌ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నేతింటి నీలంరాజు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.పర్లాకిమిడి : వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బరంపురం టాటాబిన్‌ కూడలి నుంచి ఆర్‌డిసి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఎఐకెఎస్‌ నాయకులు బాలకృష్ణ రెడ్డి, ముచ్చి బంగారు, ఎఐకెఎంఎస్‌ నాయకులు బాలచంద్ర షడంగి, కేదార్‌ సబర్‌, ఋషికుల్య రైతు సభ నాయకులు సింహాచల నాయక్‌, రైతుకూలీ సంఘం నాయకులు రొక్కం లోకనాథం తదితరులు పాల్గొన్నారు. పలాస : కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ వెంకటరమణ, లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి టి.సన్యాసిరావు, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, కాంగ్రెస్‌ పార్టీ పలాస నియోజకవర్గ నాయకులు కె.హేమారావు చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిహెచ్‌ వేణుగోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుబ్బ భాస్కరరావు, డిబానమ్మ, రైతు కూలీ సంఘం నాయకులు బి.కూర్మారావు, భీమారావు, ఎఐసిసిటియు నాయకులు డి.శ్రీనివాస్‌, కె.లోకనాదం, కాంగ్రెస్‌ నాయకులు శ్యాంసుందరరావు, రైతు నాయకులు వి.పాపయ్య, సోమేష్‌, కె.దుష్యంత్‌, బి.సాయమ్మ, తిరుపతి, ఎఐవైఎఫ్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.పొందూరు : పొందూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎ.రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️