హామీలు అమలు చేసే వరకుసమ్మె విరమించేది లేదు

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి విడనాడి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో

శ్రీకాకుళం అర్బన్‌ : కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీలు

ప్రభుత్వ ద్వంద వైఖరి విడనాడాలి

నాగావళి నదిలో అంగన్వాడీల జలదీక్ష

13వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె

జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీలు చేపట్టి సమ్మెబాట ఆదివారానికి 13వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. సమ్మెకు పలు కార్మిక, ప్రజాసంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ, సిపిఎం మద్దతు తెలిపాయి.

ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి విడనాడి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆదివారం యూనియన్‌ ఆధ్వర్యాన శ్రీకాకుళం నగరంలోని నాగావళి నదిలో కార్యకర్తలు జలదీక్ష చేస్తూ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సెంటర్ల తాళాలు పగలకొట్టమని సచివాలయ ఉద్యోగుల చేత పనిచేయిస్తూ మరోవైపు సమస్యల పరిష్కారానికి సానుకూలం ఉన్నామని ప్రకటించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. మంత్రులు ఉషశ్రీచరణ్‌, బొత్స సత్యనారాయణలు అంగన్వాడీలను ముందు విధులకు హాజరుకమ్మని చెప్పడం, మూడు నెలల్లో సమస్యలను పరిష్కారిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చర్చలు అంటూనే మరోవైపు వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు తాళాలు పగుల గొట్టమని ఆదేశాలివ్వడం, ఐసిడిఎస్‌ విధుల నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ చర్యలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరంతరం ప్రజల ఆరోగ్య భద్రత కోసం శ్రమ పడే అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి, గ్రాట్యూటీ చెల్లించడానికి డబ్బులుండవా? అని ప్రశ్నించారు. లబ్ధిదారులకు ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గించడానికి హడావుడిగా సిబ్బందిని సమకూర్చే పనిచేస్తోందని అన్నారు. తద్వారా ప్రీస్కూల్‌ నిర్వాహణ దెబ్బతింటోందన్నారు. పిల్లల ఆలనా పాలనా చూడడం అంగన్వాడీలు తప్ప మరెవ్వరు చూడలేరని గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి, ఇ.అప్పలనరసమ్మ, కృష్ణభారతి, సుశీల, నాగపద్మ, మల్లేశ్వరి, దమయంతి పాల్గొన్నారు. టెక్కలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన నిరవధిక సమ్మెకు సిఐటియు నాయకులు నంబూరి షణ్ముఖరావు, రైతు సంఘం నాయకులు పాళిన సాంబమూర్తి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌.రమ, హెచ్‌.వాణిశ్రీ, ఎల్‌.శ్రీదేవి, ఎ.రమాదేవి, పి.పద్మావతి, బి.ఆదిలక్ష్మి, కె.లత, కె.వి.లక్ష్మి, బి.రమణమ్మ, జయలక్ష్మి పూల దండలు దరించి నిరాహార దీక్షలో కూర్చున్నారు. కొత్తూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపటిన నిరవధిక సమ్మెలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.లక్ష్మి, ధనలక్ష్మి, కె.వి.హేమలత, జలజాక్షి, బోడెమ్మ, పి.అనసూయమ్మ. పి.లక్ష్మి, డి.వాణి, పి.కళావతి, విజయకుమారి, ఎస్‌.భవాని, బి.మంగమ్మ, ఎ.రవణమ్మ, కె.రోజా పాల్గొన్నారు. నరసన్నపేట ఐటిడిఎస్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంఘీభావం తెలిపారు. ఈయన వెంట మండలం పార్టీ అధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్‌, జామి వెంకటరావు, కింజరాపు రామారావు, ఊర్ణ వెంకటేశ్వర్లు, భైరి భాస్కరరావు, కోరాడ రామచంద్రరావు, పీసా కృష్ణ, మహిళా సెంట్రరీ జి.ఝాన్సీ, కూన రమేష్‌ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం బస్టాండ్‌ వద్ద చేపడుతున్న సమ్మె కొనసాగుతుంది. పొందూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.జ్యోతిలక్ష్మి, రమణమ్మ, రమ, కృష్ణవేణి పాల్గొన్నారు. కొవ్వొత్తుల ర్యాలీనగరంలోని పొట్టిశ్రీరాములు కూడలి నుంచి మున్సిపల్‌ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు, సిఐటియు నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, పెన్షనర్స్‌ సంఘం నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఎం.గోవర్థన్‌, ఐద్వా జిల్లా కన్వీనర్‌ లక్ష్మి, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, నాయకులు టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి, ముత్యాలమ్మ, లీలా, భవానీ పాల్గొన్నారు.ఎచ్చెర్లలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి అంగన్వాడీలు, సిఐటియు నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, ఐఎంఎల్‌ డిపో వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు, రమణ, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయుకులు శారద, విజయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే కోటబొమ్మాళి, సోంపేట మండలాల్లోలోనూ అంగన్వాడీలు, టిడిపి, జనసేన నాయకులు పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

 

➡️