హోదాపై ప్రశిస్తే అరెస్టులా?

ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతూ

మాట్లాడుతున్న విద్యార్థుల సంఘ నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతూ చేపట్టిన చలో సిఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను అరెస్టు చేయడం అన్యామన్నారు. నగరంలోని క్రాంతి భవన్‌లో , ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్‌, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి జిల్లా అధ్యక్షులు జి.నర్సునాయుడు, ఎఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు శనివారం మాట్లాడారు. ప్రధాని మోడీ తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వాగ్ధానాన్ని అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకొస్తానని చెప్పిన సిఎం జగన్మోహన్‌రెడ్డి వంచించి ఐదేళ్లు కాలక్షేపం చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.చందు, ఎఐవైఎఫ్‌ నాయకులు అరవింద్‌ పాల్గొన్నారు.

 

➡️