12న వైసిపి విస్తృతస్థాయి సమావేశం

వైసిపి జిల్లా విస్తృతస్థాయి, ఆత్మీయ

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కృష్ణదాస్‌, చిన్న శ్రీను

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వైసిపి జిల్లా విస్తృతస్థాయి, ఆత్మీయ సమావేశాన్ని ఈనెల 12న నగరంలోని ఆనందమయి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల ఫంక్షన్‌ హాల్‌లో సమావేశ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ ఉప సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)తో కలిసి బుధవారం పరిశీలించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ వై.వి సుబ్బారెడ్డి, కో కన్వీనర్‌ మజ్జి శ్రీనివాసరావు హాజరవుతున్నారని చెప్పారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, పార్లమెంట్‌ సభ్యులు, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, నియోజకవర్గ పరిశీలకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.

➡️