14న సిఎం జగన్‌ రాక

ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 14వ తేదీన పలాసలో పర్యటించనున్నట్లు రాష్ట్ర

వైద్యాధికారులతో మాట్లాడుతున్న మీనాక్షి

ప్రజాశక్తి – పలాస

ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 14వ తేదీన పలాసలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. కంచిలి మండలం మకరాంపురంలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుని ప్రారంభించనున్నారని తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ పద్మనాభపురం వద్ద రూ.50 కోట్లతో నిర్మించిన 200 పకడల ఆస్పత్రితో పాటు కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారని చెప్పారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15వ తేదీన సిఎం పలాసలో పర్యటించాల్సి ఉండగా, 14వ తేదీకి మార్చినట్లు సిఎంఒ కార్యాలయం నుంచి సమాచారం అందిందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పర్యటనా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్‌పిసిఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక సోమవారం పరిశీలించారు. హెలీప్యాడ్‌, బహిరంగ సభ నిర్వహించే రైల్వే క్రీడా మైదానం, కిడ్నీ ఆస్పత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్‌ అధికారులతో సమీక్షించారు. రూట్‌మ్యాప్‌పై అధికారులతో చర్చించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట డిఎస్‌పి నాగేశ్వర్‌ రెడ్డి, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి సిఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలిసిఎం పర్యటన నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ మంత్రి బి.మీనాక్షి వైద్యాధికారులను ఆదేశించారు. కిడ్నీ ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యాధికారుల నుంచి సిబ్బంది వరకు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హెలీప్యాడ్‌, కిడ్నీ ఆస్పత్రి, బహిరంగ సభ వద్ద పూర్తిస్థాయిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో రెంటికోట, వెంకటాపురం, అక్కుపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ వైద్యాధికారులు టి.సునీల్‌ కుమార్‌, దేవి, శ్యామ్‌, సాయి, విజరు తదితరులు పాల్గొన్నారు.

 

➡️