27న గెస్ట్‌ ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూ

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల

ప్రజాశక్తి- శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అధ్య ర్యంలో జిల్లాలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి కంచిలి బిఆర్‌.అంబేద్కర్‌ గురుకులం (బాలురు)లో ఖాళీగా ఉన్న పిజిటి మ్యాథ్స్‌(పురుషులు), మందన బాలికల గురుకులంలో ఖాళీగా ఉన్న జెఎల్‌ జువాలజీ (మహిళా అభ్యర్థి) గెస్ట్‌ ఫ్యాకల్టీ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం ఈ నెల 27న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఎపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త ఎన్‌. బాలాజీ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి గల పురుష, మహిళా అభ్యర్థులు బయోడేటాతో పాటు పిజి, బిఇడి, టెట్‌ (క్వాలిఫైడ్‌) ఒరిజినల్‌ సర్టిఫికెట్లుతో జిల్లా కేంద్రంలో ఆదివారం పేటలో గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్యయాధికారి కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే డెమోకు హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 08942-279826, 97017 36362, 9000314209 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలన్నారు.

➡️