9న జాతీయ లోక్‌ అదాలత్‌

జిల్లాలోని అన్ని కోర్టుల్లో మార్చి తొమ్మిదో తేదీన

మాట్లాడుతున్న జిల్లా ప్ర్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలోని అన్ని కోర్టుల్లో మార్చి తొమ్మిదో తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షులు జునైద్‌ అహ్మద్‌ మౌలానా వెల్లడించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు పోలీసు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసి పని భారం తగ్గించుకోవాలన్నారు. పోలీసులు రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించి, ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ అయితే పోలీస్‌ యంత్రాంగానికి పెద్ద కేసులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, మహేంద్ర ఫణిభూషణ్‌ భాస్కరరావు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి అనురాధ, ఎఎస్‌పి ప్రేమ్‌కాజల్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ మల్లేశ్వరరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నాగభూషణరావు, తంగి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️