కూటమి అభ్యర్థుల రోడ్‌షో

ఎన్‌డిఎ కూటమి ఆధ్వర్యాన సోమవారం నగరంలో

ప్రచారం చేస్తున్న రామ్మోహన్‌ నాయుడు, గొండు శంకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్‌డిఎ కూటమి ఆధ్వర్యాన సోమవారం నగరంలో టిడిపి రోడ్‌ షో నిర్వహించారు. టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌ ఆధ్వర్యాన పాతబస్టాండ్‌ నుంచి మొదలైన రోడ్‌ షోలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతిలు హాజరై మాట్లాడారు. పాతబస్టాండ్‌, కళింగ రోడ్డు, ఏడు రోడ్ల జంక్షన్‌, గుజరాతీపేట, మీదుగా రెల్లి వీధి, 9వ డివిజన్‌ పరిధిలోని ఇల్లిసిపురం, భద్రమ్మ కోవెల, 11 డివిజన్‌లోని గారవీధి జంక్షన్‌లో రోడ్‌ షో కొనసాగింది. వివిధ కూడళ్లలో ప్రజలనుద్దేశించి వారు మాట్లాడారు. రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలని, అదోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి పునర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చంద్రబాబును సిఎం చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగు తుందన్నారు. జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ కోరాడ సర్వేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమా మహేశ్వరరావు, టిడిపి డివిజన్‌ ఇన్‌ఛార్జిలు కవ్వాడి సుశీల, గండేపల్లి కోటేశ్వరరావు, కోటేశ్వరరావు, బుర్రి మధు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

 

➡️