రెండో రోజూ కొనసాగుతున్న సమ్మె

Dec 13,2023 12:17 #srikakulam
anganwadi protest 2nd day sklm

ప్రజాశక్తి-శ్రీకాకుళం : కనీస వేతనం రూ 26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజూ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. పలు ప్రజా, కార్మిక సంఘాల నాయకులు సమ్మె శిబిరాలకు హాజరై సంఘభావం ప్రకటించారు. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన దృణలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కల్యాణి మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు అల్లు సత్యనారాయణ, యూనియన్ నాయకులు టి రాజేశ్వరి, ప్రమీలదేవి తదితరులు పాల్గొన్నారు

➡️