అరసవల్లి ఆదాయం రూ.7.26 లక్షలు

అరసవల్లి సూర్యనారాయణ

చెక్కును అందజేస్తున్న వెంకట రమణమూర్తి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో ఆదివారం ఒక్క రోజు రూ.7.26 లక్షల ఆదాయం సమకూరింది. టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.3.96 లక్షలు, విరాళాల రూపంలో రూ.78,890, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2,51,840 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.నిత్యాన్నదాన పథకానికి విరాళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శ్రీకాకుళం రూరల్‌ మండలం కిల్లిపాలెంకు చెందిన సింహాద్రి వెంకట రమణమూర్తి, జ్యోతి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఆలయ ఇఒ చంద్రశేఖర్‌కు చెక్కును అందజేశారు.

➡️