అధ్వాన రోడ్డుతో అవస్థలు

మండలంలో నౌపడ రైల్వేగేటు వద్ద ఉన్న రోడ్డు పుర్తిగా

శిథిలావస్థకు చేరుకున్న రోడ్డు

టెక్కలి:

మండలంలో నౌపడ రైల్వేగేటు వద్ద ఉన్న రోడ్డు పుర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. పూండీ మార్గంలో ప్రధాన రహదారి కావడం, ఈ రోడ్డు మీదుగా నౌపడ రైల్వే జంక్షన్‌కి వెళ్లే మార్గం కావడం, ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్టు నిర్మానానికి ఆవసరమైన ప్రధాన మార్గం కూడా ఈ రోడ్డే కావడంతో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రోడ్డు సుమారు ఏడాది కాలంగా మరమ్మతులకు గురైనప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో ఈ రోడ్డు ప్రయాణం చేసే వాహనదారులు ప్రమాదానికి గురికావడమే కాకుండా వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే శాఖ పరిధిలో ఈ మార్గం ఉండడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రైల్వేశాఖాధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

 

➡️