బడి తెరిచిన రోజే పుస్తకాలు

వచ్చే విద్యా

శ్రీకాకుళం నగరంలోని గొడౌన్‌ నుంచి మండలాలకు తరలిస్తున్న పుస్తకాలు

  • విద్యార్థులకు అందడంపై నెలకొన్న సందేహాలు
  • జిల్లాకు కావాల్సిన పుస్తకాలు 6,26,925
  • ఇప్పటివరకు వచ్చినవి 2,85,39615

మండలాలకు ఒక్కపుస్తకమూ చేరని పరిస్థితి2024-25 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఉచిత పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది సకాలంలో ఎంత మేర సమకూరుస్తారనే అంశంపై సందిగ్థత నెలకొంది. పాఠశాలల ప్రారంభానికి ఇంకా ఇరవై రోజులే ఉంది. విద్యార్థులు పాఠశాలలకు వచ్చిన మొదటి రోజునే పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక కిట్లను అందజేయాల్సి ఉంది. ఎన్నికల సమయం కావడంతో కొందరు టీచర్లు ఓట్ల లెక్కింపు విధుల్లో ఉంటారు. దీంతో ఈసారి పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలసమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాకు అవసరమైన పుస్తకాల్లో ఇప్పటివరకు మూడో వంతు వచ్చాయి. వచ్చే నెల 12న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంత మేరకు విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తారో? అన్నది సందేహంగా కనిపిస్తోంది.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాకు కలిపి మొత్తం పుస్తకాలు కావాలి. ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ఇండెంట్‌ పెట్టారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు కావాల్సినవి 7,37,662 పుస్తకాలు అవసరం కాగా, పుస్తకాల గొడౌన్‌లో 1,10,737 పుస్తకాలు బఫర్‌ నిల్వలు ఉన్నాయి. దీంతో జిల్లా విద్యార్థులకు 6,26,925 పుస్తకాలు కావాల్సి ఉంది. జిల్లా అవసరాలతో పాటు అదనంగా మరో పది శాతంపైగా పుస్తకాల కోసం ప్రింటింగ్‌ ఆర్టర్‌ పెట్టారు. ఇప్పటివరకు జిల్లాకు 2,85,396 పుస్తకాలు వచ్చాయి. మరో 4,10,588 పుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాకు వచ్చిన పుస్తకాలను ఎప్పటికప్పుడు మండల కేంద్రాలకు పంపిస్తున్నారు. గురువారం నాటికి జిల్లాలోని 15 మండలాలకు 2,52,947 పుస్తకాలను సరఫరా చేశారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు పుస్తకాల పంపిణీని మూడు ప్రయివేట్‌ ప్రింట్లరకు అప్పగించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు సంబంధించి పుస్తకాల ప్రింటింగ్‌, సరఫరా బాధ్యతలను సంబంధిత ప్రయివేట్‌ సంస్థలే చూస్తున్నాయి. ప్రింట్‌ చేసిన పుస్తకాల మేరకు వారు నేరుగా మండల కేంద్రాలకు చేరవేస్తున్నారు.15 మండలాలకు ఒక్క పుస్తకమూ చేరని పరిస్థితిఒకటి నుంచి ఏడో తరగతి వరకు సరఫరా చేయాల్సిన పుస్తకాల్లో ఏవీ సక్రమంగా రాలేదు. ఒకటి, రెండు, ఆరో తరగతిలకు సంబంధించిన పుస్తకాలు పూర్తిస్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన తరగతుల పుస్తకాలకు సంబంధించి కొన్ని టైటిల్స్‌ మాత్రమే జిల్లా గొడౌన్‌కు చేరాయి. జిల్లాలో 30 మండలాలు ఉండగా, ఇప్పటివరకు సగం మండలాలకే పుస్తకాలను సరఫరా చేశారు. జిల్లాలోని 15 మండలాలకు ఇప్పటివరకు ఒక్క పుస్తకమూ చేరని పరిస్థితి నెలకొంది.పదో తరగతికి సిబిఎస్‌ఇ సిలబస్‌ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ మారనుంది. సిబిఎస్‌ఇ సిలబస్‌ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు స్టేట్‌ సిలబస్‌ చదువుకున్న విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది కొంత కష్టతరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని పలువురు ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.ప్రయివేట్‌ విద్యార్థులకు రెండు రకాల సిలబస్‌లుప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒకేరకమైన సిలబస్‌ అమలవుతుండగా ప్రయివేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాలు రెండు రకాల సిలబస్‌ను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్యాంశాలను బోధిస్తూనే మరోవైపు వారు నిర్ణయించిన సిలబస్‌నూ పిల్లలపై రుద్దుతున్నారు. ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో రెండు రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు రెండు రకాల సిలబస్‌కు సంబంధించి పుస్తకాలను కొనుగోలు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారమూ పడుతోంది.ఈ ఏడాదైనా పుస్తకాలు సక్రమంగా ఇచ్చేనా?నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో జాప్యం జరుగుతోంది. పాఠశాలలు తెరిచిన రోజే అందిస్తామని చెప్తున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతోంది. పాఠశాలలు తెరిచిన అనంతరం రెండు, మూడు నెలల పాటు పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి గతంలో తలెత్తింది. జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు మూడో వంతు పుస్తకాలు మాత్రమే వచ్చాయి. వచ్చే నెల 12వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమయానికి ఎంత మేరకు సరఫరా చేయగలుగుతారనేది వేచి చూడాల్సి ఉంది.

సకాలంలో పంపిణీకి చర్యలు

జిల్లాలో సకాలంలో పుస్తకాల సరఫరాకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వానికి పంపిన ఇండెంట్‌ మేరకు పలు విడతలుగా పుస్తకాలు జిల్లాకు చేరాయి. వాటిని మండల పాయింట్లకు వెంటనే పంపిస్తున్నాం. ఇప్పటివరకు 15 మండలాలకు పుస్తకాలను పంపాం. పాఠశాలల తెరిచే నాటికి విద్యార్థులకు చేతుల్లో పుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

– సతీష్‌, జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల మేనేజర్‌

➡️