విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేత

మండలంలోని వరిసాం పంచాయతీ అరబిందో ఫార్మా ఫౌండేషన్‌

సర్టిఫికెట్లతో విద్యార్థులు, పరిశ్రమ ప్రతినిధులు

రణస్థలం :

మండలంలోని వరిసాం పంచాయతీ అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రాం శుక్రవారం నిర్వహించారు. ఎంఎస్‌సి చదివిన విద్యార్థులకు ‘ఫార్మా సిటీకాల్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలైటికల్‌ టెక్నిక్స్‌’ పై ఆరునెలల శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కాలం ముగిసిన సందర్బంగా 10వ బ్యాచ్‌ 30 మంది విద్యార్థిని, విద్యార్ధులకు సర్టిఫికెట్లును కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌ డిపార్ట్మెంట్‌ యు.ఎన్‌.బి.రాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ ఆపరేషన్స్‌ మదన్‌ కుమార్‌ చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌ ఎడ్మిన్‌ డిపార్ట్‌మెంట్‌ కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల శిక్షణలో అనుభవజ్ఞలైన అధ్యాపకులతో, అధునాతన యంత్రాలతో ఫార్మా అండ్‌ కెమికల్స్‌కు అవసరమైన శిక్షణ ఇవ్వడమైందన్నారు. ఈ ఆరు నెలల శిక్షణ కార్యక్రమం వలన వివిధ ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు పొంద డానికి అవకాశం ఉందన్నారు. అపిటోరియాఫార్మా, అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

 

➡️