అనారోగ్యంతో సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ మృతి

మండలంలోని కొర్లకోటకు చెందిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ పేడాడ

సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి- ఆమదాలవలస

మండలంలోని కొర్లకోటకు చెందిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ పేడాడ రాజగోపాలరావు (29) అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్‌ సిఆర్‌పిఎఫ్‌ బెటాలి యన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజగోపాలరావు గురువారం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన సగ్రామమైన కొర్లకోట గ్రామానికి శుక్రవారం సిఆర్‌పిఎఫ్‌ అధికారులు ప్రత్యేక వాహనంలో పార్థివ దేహాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానిక ఎస్‌ఐ కె.వెంకటేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు సిఆర్‌పిఎఫ్‌ బలగాలు జవాన్‌ మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్య క్రియల ఖర్చుల నిమిత్తం రూ.50వేలు మృతుని భార్య చాందినికి పోలీసుల అందించారు. భార్యతో పాటు ఆయనకు నాలుగేళ్ల కుమార్తె కలదు. కార్యక్రమంలో ఎంపిటిసి అన్నెపు భాస్కరరావు, సర్పంచ్‌ ప్రతినిధి సనపల అప్పలనాయుడు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️