వికలాంగులకు పళ్లు పంపిణీ

దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరుతో

పళ్లను పంపిణీ చేస్తున్న ట్రస్టు సభ్యులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరుతో ట్రస్టును నెలకొల్పి ప్రజలకు సేవలందించడం ప్రశంసనీయమని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ ప్రతినిధి ఎస్‌. జోగినాయుడు అన్నారు. ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్‌.ఆర్‌.గంజి, ఆయన కుమారుడు ట్రస్టు సభ్యులు ప్రొఫెసర్‌ గంజి సంజీవయ్య వర్థంతి కార్యక్రమం నగరంలోని మథర్‌ థెరిసా హోంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై హోంలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా ఎస్‌ఆర్‌ గంజి, సంజీవయ్యల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ట్రస్టును నెలకొల్పి అనేక మందికి సేవలు అందించిన ఎస్‌.ఆర్‌.గంజి, గంజి సంజీవయ్యలు కోవిడ్‌ సమయంలో మరణించారని గుర్తు చేశారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్న గంజి ఎజ్రాను అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కాటమ్‌ హానిరోజ్‌, న్యాయవాది కట్టా పార్థసారధి, ఎన్‌.కిరణ్‌, బి.రవీంద్రబాబు, మాజీ సర్పంచ్‌ అలుదు అప్పన్న, ఆర్‌.పి.రావు, అబ్రహాం, వై.శ్రీనివాసరావు, ఎ. ఏసుదాసు, ఎం. రమణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️