కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దు

రాజకీయ పార్టీల కోసం అనవసర రాద్ధాంతాలతో వివాదాలు

మెళియాపుట్టి : అవగాహన కల్పిస్తున్న సిఐ నల్లి సాయి

ఆమదాలవలస:

రాజకీయ పార్టీల కోసం అనవసర రాద్ధాంతాలతో వివాదాలు కొని తెచ్చుకొని పోలీసు కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని స్థానిక ఎస్‌ఐ కె.వెంకటేష్‌ అన్నారు. ఆదివారం మండలంలోని గాజుల కొల్లివలస, నెల్లిపర్తి గ్రామాల్లో రాజకీయ వివాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎంతో సంయమనం పాటించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రతిఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఎన్నికల సంఘ నిబంధనలు అమల్లో ఉన్నాయని, కౌంటింగ్‌ రోజు కూడా ప్రతి గ్రామంలోనూ ప్రజలు పోలీసు నిబంధనలను పాటించి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లో తలదూర్చి తమ భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దన్నారు. ప్రతిఒక్క యువకుడు రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.మెళియాపుట్టి : ఎన్నికల కౌంటింగ్‌ దృష్ట్యా ఎటువంటి అల్లర్లకు దిగకుండా ప్రశాంతంగా ఉండాలని పాతపట్నం సిఐ నల్లి సాయి, ఎస్‌ఐ టి.రాజేష్‌ సూచించారు. మండలంలోని చాపర, చీపురుపల్లి గ్రామాల్లో శనివారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

 

➡️