10 నుంచి ఆర్‌టిసిలో డ్రైవింగ్‌ శిక్షణ

ఎపిఎస్‌ ఆర్‌టిసి హెవీ

శ్రీకాకుళం అర్బన్‌: ఎపిఎస్‌ ఆర్‌టిసి హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌లో 16వ బ్యాచ్‌ను ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజరు కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 15 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ సర్టిఫికేట్‌తో పాటు హెవీ లైసెన్స్‌లు అందజేసినట్లు పేర్కొన్నారు. మారుతున్న డ్రైవింగ్‌ విధానాలకు అనుగుణంగా, మంచి అనుభవం కలిగిన డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లతో ఆర్‌టిసిలో హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌లో డ్రైవింగ్‌ నేర్పించనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసిలో శిక్షణ తీసుకున్న ప్రతిఒక్కరికీ ఆర్‌టిసితో పాటు మిగతా ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్‌గా ఉద్యోగావకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. బ్యాచ్‌కు 16 మంది మాత్రమే శిక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఏడాది అనుభవమున్న వారు శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 40 రోజుల శిక్షణతో పాటు మెకానికల్‌ వర్క్‌, విడిభాగాలు, యోగా, వ్యక్తిత్వ వికాసం, రోడ్డు ట్రాఫిక్‌ రూల్స్‌ అంశాలపై ఉన్నతమైన శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.

➡️