మూగజీవులు విలవిల

మండుతున్న ఎండల నేపథ్యంలో మూగజీవులు నీటికోసం

చెట్టు నీడన సేద తీరుతున్న మేకలు

ప్రజాశక్తి- టెక్కలి

మండుతున్న ఎండల నేపథ్యంలో మూగజీవులు నీటికోసం విలవిలలాడుతున్నాయి. ఎన్నడులేని విధంగా ఈ ఏడాది వేసవికాలంలో తీవ్రమైన వేడి గాలులు, వేడిమి వాతావరణం ఉండడంతో గ్రామాల్లోని బావులు నీటి నిల్వలు ఉన్న ప్రదేశాలు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో ఎక్కడా నీటి నిల్వలు లేకపోవడంతో మూగజీవులు నీటికోసం ఆరాటపడుతున్నాయి. పాడి పంటలుగా ప్రసిద్ధి చెందిన గ్రామాల్లో పశువులు తాగేందుకు నీరూ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాడి రైతులు పశువుల దాహార్తిని తీర్చడానికి నానా యాతనలు పడుతున్నారు. మేత కోసం పశువులు మైదాన ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటి దాహార్తిని తీర్చడానికి రైతులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. యాదవులు మేకలు, గొర్రెలు కూడా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పశుసంవర్థకశాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో పశువులకు నీటి నిల్వల కోసం తొట్టెలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వేడిమి వాతావరణానికి వర్షాలు లేక, నీరు దొరకని పరిస్థితుల్లో పశువులకు నీటి ఇబ్బందులు లేకుండా సంబంధిత ఆధికారులు చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.

 

➡️