చిన్నారికి ఆర్థికసాయం

మండల కేంద్రం లావేరులో సెగిడివీధికి చెందిన

అనుష్క తల్లిదండ్రులకు నగదు అందజేస్తున్న ఫౌండేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి- లావేరు

మండల కేంద్రం లావేరులో సెగిడివీధికి చెందిన చిన్నారి మెండ అనుష్క లుకెమియా వ్యాధి బారిన పడింది. పేద కుటుంబం కావటంతో రూ. 6 లక్షలు వైద్యానికి ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తాము బతకటానికే ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు రూ.6 లక్షలు ఎక్కడ నుంచి వస్తాయని ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న సహాయం చేస్తున్న హృదయలు ఫౌండేషన్‌ బృందం సభ్యులు ఆదివారం చిన్నారి ఇంటికి వెళ్లి తమవంతు సాయంగా రూ.పదివేలు నగదును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యులు మాట్లాడుతూ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించి చిన్నారి జీవితాన్ని కాపాడే విషయంలో చిన్నారికి అండగా ఉండాలని, చిన్నారి వ్యాధి నుంచి కొలుకొనేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

 

➡️