బాలికలదే హవా

ఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన

తల్లిదండ్రులతో స్టేట్‌ టాపర్‌ చింతు రేవతి

ప్రథమ, ద్వితీయం రెండింటిలోనూ ముందంజ

ద్వితీయంలో 73 శాతం, ప్రథమంలో 63 శాతం ఉత్తీర్ణత

ప్రథమంలో స్టేట్‌ టాపర్‌గా చింతు రేవతి

466 మార్కులతో జిల్లా టాపర్‌గా లీలాకుమారి

ద్వితీయంలో 990 మార్కులతో అదరగొట్టిన ప్రేమ్‌ చరణ్‌

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు 73 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 60 శాతం మంది మాత్రమే పాస్‌ అయ్యారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలికలు 63 శాతం మంది పాస్‌ కాగా, బాలురులో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికల్లో ఉత్తీర్ణత శాతంతో జిల్లా పరువు దక్కింది. లేకుంటే ఫలితాల్లో జిల్లా అట్టడుగున నిలిచేది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 24వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సర ఫలితాల్లో 21వ స్థానం దక్కింది. పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ప్రథమ సంవత్సరంలో జిల్లాకు చెందిన చింతు రేవతి స్టేట్‌ టాపర్‌గా నిలిచారు. 470 మార్కులకు గానూ 467 మార్కులు సాధించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం తంగివానిపేటకు చెందిన వి.లీలా కుమారి ఎంపిసి విభాగంలో 470 మార్కులకు గానూ 464 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపిసి విభాగంలో డి.ప్రేమ్‌ చరణ్‌ 1000 మార్కులకు గానూ 990 మార్కులు సాధించారు.ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధిఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 16,769 మంది హాజరు కాగా 11,300 మంది (67 శాతం) మంది పాసయ్యారు. వీరిలో 9,362 మంది బాలికలకు గానూ 6,849 మంది ఉత్తీర్ణత (73 శాతం) సాధించారు. బాలురుల్లో 7,407 మంది పరీక్షలు రాయగా 4,451 మంది (60 శాతం) పాసయ్యారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 18,249 మంది హాజరు కాగా 10,408 మంది (57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలికలు 10,250 మంది పరీక్షలు రాయగా 6,461 మంది (63 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురుల్లో 7,999 మంది పరీక్షలకు హాజరు కాగా 3,947 మంది (49 శాతం) మంది పాసయ్యారు.ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయిఒకేషనల్‌ రెండో సంవత్సరం పరీక్షలకు 1078 మంది హాజరు కాగా 797 మంది (74 శాతం) పాసయ్యారు. ఇందులోనూ బాలికలదే పైచేయిగా ఉంది. పరీక్షలకు 643 మంది బాలికలు హాజరు కాగా 553 (86 శాతం) పాసయ్యారు. 435 మంది బాలురు పరీక్షలు రాయగా, 244 మంది (56 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు 1103 మంది హాజరు కాగా 730 మంది (66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలికలే అత్యధిక మంది పాసయ్యారు. పరీక్షలకు 613 మంది బాలికలు హాజరు కాగా 511 మంది (83 శాతం) హాజరయ్యారు. 490 మంది బాలురు హాజరు కాగా, 219 మంది (45 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.ప్రథమంలో స్టేట్‌ టాపర్‌గా చింతు రేవతిఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపిసి విభాగంలో జిల్లాకు చెందిన చింతు రేవతి స్టేట్‌ టాపర్‌గా నిలిచారు. 470 మార్కులకు గానూ 467 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఈమె విశాఖలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్నారు. కోటబొమ్మాళి మండలం సుబ్బారావు గ్రామం వీరి స్వస్థలం. ఈమె తండ్రి సిహెచ్‌.కృష్ణమూర్తి, తల్లి జయమ్మ ఇరువురూ వ్యవసాయం చేస్తున్నారు. ఆమె నరసన్నపేటలోని ఓ ప్రయివేట్‌ కళాశాలలో చదివి 581 మార్కులు సాధించారు.జిల్లా టాపర్‌గా లీలా కుమారిప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపిసి విభాగంలో శ్రీకాకుళం రూరల్‌ మండలం తంగివానిపేటకు చెందిన వెలమల లీలా కుమారి జిల్లా టాపర్‌గా నిలిచారు. 470 మార్కులకు గానూ 466 మార్కులు వచ్చాయి. ఈమె తండ్రి గోపి వ్యవసాయం చేస్తుండగా, తల్లి రాములమ్మ గృహిణి. లీలాకుమారి శ్రీకాకుళం నగరంలోని గ్లోబల్‌ స్కూల్‌లో పదో తరగతిలో 584 మార్కులు సాధించారు. ఇంజినీరింగ్‌ చేయాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు. అదరగొట్టిన ప్రేమ్‌ చరణ్‌ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపిసి విభాగంలో శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురానికి చెందిన డి.ప్రేమ్‌ చరణ్‌ 1000 మార్కులకు గానూ 990 మార్కులు సాధించారు. తండ్రి ఏడుకొండలు కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, తల్లి కృష్ణపాప గృహిణి. సోంపేట సంస్కార భారతిలో చదువుతున్న రిషిక ఆచారి 989, పి.సందీప్‌ 989 మార్కులు వచ్చాయి. ద్వితీయ సంవత్సరం బైపిపిలో సాధు భార్గవి 979 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో ఎం.వి.వి.ఎస్‌ సంహిత, పి.రాహుల్‌కు 470 మార్కులకు గానూ ఇరువురికీ చెరో 465 మార్కులు వచ్చాయి.

 

➡️