నేలవాలిన అరటి, బొప్పాయిఈదురుగాలులతో వర్షం

మండలంలో సోమవారం

కొత్తరౌతుపేట వద్ద రహదారికి అడ్డంగా పడిన చెట్టు

  • విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

ప్రజాశక్తి – లావేరు

మండలంలో సోమవారం ఉదయాన్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు బొప్పాయి, అరటి పంటలు నేలవాలాయి. లావేరు, లావేటిపాలెం, జిజివలస, కేశవరాయపురం, సూర్యనారాయణపురం గ్రామల్లో సుమారు వందెకరాల్లో ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు గాలులకు నేలకొరిగాయి. పంట పూర్తిగా పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసం అప్పు చేసి పెట్టుబడులు పెట్టామని వాపోతున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిమారం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తామాడ, సూర్యనారాయణపురం, పట్టణాయునిపేటలో ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు విరిగి రహదారికి అడ్డంగా పడ్డాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. రహదారిపై అడ్డంగా పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను తొలగించి, కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

 

 

➡️