ఎఆర్‌టి సెంటర్‌లో హెల్ప్‌డెస్క్‌

హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు

మాట్లాడుతున్న డాక్టర్‌ నరసింహరావు

శ్రీకాకుళం అర్బన్‌:

హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు పరీక్షలు ఎఆర్‌టి కేంద్రంలోనే నిర్వహించనున్నట్లు ఎఆర్‌టి నోడల్‌ అధికారి డాక్టర్‌ నరసింహరావు తెలిపారు. సోమవారం రిమ్స్‌ ఆస్పత్రిలో ఉన్న ఎఆర్‌టి సెంటర్‌లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలిం చారు. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదేశాలను అనుసరించి జిల్లా సర్వజన ఆస్పత్రి ఎఆర్‌టి కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. సోమవారం నుంచి నిరంతరాయంగా ఈ కేంద్రం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎఆర్‌టి మందులు వాడుతున్న వారితో పాటు జీవిత భాగస్వామి, పిల్లల ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. నియంత్రణ సంస్థ ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షించాలని, వ్యాధి వ్యాప్తిని నియంత్రి ంచడానికి ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. డాక్టర్‌ సిహెచ్‌ అప్పల నాయుడు, డాక్టర్‌ చైతన్య, డిపిఎం కె.ఉమా మహేశ్వరరావు, జె.సంతోష్‌కుమార్‌, తారకేశ్వరరావు, పి.ఉష, హెచ్‌. నాగభూషణం, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది హాజరయ్యారు.

 

➡️