కానరాని అగ్నిమాపక వారోత్సవాలు

వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉండే

పొందూరు అగ్నిమాపక కేంద్రం

ప్రజాశక్తి- పొందూరు

వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉండే కాలం. ఈ కాలంలో భానుడు భగభగా మండడంతో ఎండలు తీవ్రత కారణంగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అగ్ని ప్రమా దాలు జరిగి నట్లుగా వింటూ ఉంటాం. ఇలాంటి సమ యంలో అగ్నిప్రమాదాలు ఏ విధంగా సంభవిస్తాయి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వాటిని నివారించాలనేది ప్రజల్లో అవగాహన కలిగించాలి. తద్వారా ధన, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అందుకుగాను ప్రతిఏటా ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను ప్రభుత్వం చేపట్టి సదస్సులు, డెమోలు, ప్రదర్శనలు ద్వారా ప్రజల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తుంది. జిల్లాలో అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో వారోత్సవాలను నిర్వహించినప్పటికీ పొందూరు అగ్నిమాపక కేంద్రంలో మాత్రం ఈ వారోత్సవాల నిర్వాహణ మాత్రం కాన రాలేదంటూ పలువురు పేర్కొంటున్నారు.అవుట్‌పోస్టు అగ్నిమాపక కేంద్రం కావడంతో వీటి నిర్వాహణ బాధ్యతలను కాంట్రాక్టు ప్రాతిపదికన చేపడతారు. ఇందులో సిబ్బంది జీతభత్యాలు, అగ్నిమాపక వాహనం నిర్వాహణను అంతా ఆ కాంట్రాక్టర్‌ చూసుకోవాల్సి ఉంటుంది. కాని మార్చి 2024తో ఈ కాంట్రాక్ట్‌ కాలం ముగియడంతో అధికారులు అగ్నిమాపక వారోత్సవాలను చేపట్టలేదు. దీనిపై ఇన్‌ఛార్జి ఎస్‌ఎఫ్‌ఒ పి.అశోక్‌ మాట్లాడుతూ పొందూరు అవుట్‌పోస్టు అగ్నిమాపక కేంద్రం కాంట్రాక్ట్‌ గడువు గత నెలతో ముగిసిందని, ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తరువాత కొత్త కాంట్రాక్ట్ట్‌లను నియామకం చేపట్టడం జరుగు తుందని, అంతవరకూ కేంద్రం నిర్వాహణను చూడాలని డిఎఫ్‌ఒ ఇప్పుడున్న కాంట్రాక్టర్‌కు తెలిపారన్నారు. ఆ కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడం వలన అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించలేదని పేర్కొన్నారు.

 

➡️