సుందరయ్య ఆశయాలు సాధిద్దాం

ప్రజా ఉద్యమాలు

శ్రీకాకుళం అర్బన్‌ : చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో పుచ్చలపల్లి సుందరయ్య దిక్చూచి అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి అన్నారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతి సభ ఆదివారం నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ దేశంలో విప్లవోద్యమ నిర్మాణంలో సుందరయ్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నేతృత్వం వహించి నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపారన్నారు. భారత పార్లమెంట్‌ తొలి ప్రతిపక్ష నేతగా నిరుపమానమైన ప్రతిభ చూపారని గుర్తు చేశారు. సిపిఎం వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆయన చూపిన పోరాట మార్గాన మరిన్ని సమరశీల పోరాటాలు నిర్మించి ముందుకు సాగిన నాడే ఆయనకిచ్చిన ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.జి.కె.మూర్తి, కె.శ్రీనివాసు, సత్తారు భాస్కరరావు, ఆదినారాయణమూర్తి, ప్రభాకరరావు, సూరయ్య, కొత్తకోట అప్పారావు, తిరుపతిరావు, ప్రకాశరావు, చంద్రశేఖర్‌, కామినాయుడు పాల్గొన్నారు.సోంపేట: ఉద్దాన ప్రాంతానికి మామిడిపల్లి ఒకానొక దశలో ఉద్యమ కేంద్రంగా పనిచేసిందని, భవిష్యత్‌లోనూ అటువంటి విప్లవాత్మకమైన పాత్రని మామిడిపల్లి పోషించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు కర్రి సింహాచలం అన్నారు. మండలంలోని మామిడిపల్లిలో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు జుత్తు నీలకంఠం, తెప్పల పాపారావు, సిపిఎం పాతిన ముకుందరావు, గోరకల మన్మథరావు, తాళపత్ర రామారావు, గేదెల చిన్నబాబు పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌: సుందరయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. స్థానిక ఐటియు కార్యాలయం ఆవరణలో మండల కమిటీ కన్వీనర్‌ కొల్లి ఎల్లయ్య ఆధ్వర్యాన సుందరయ్య వర్థంతి సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో హెచ్‌.ఈశ్వరరావు, పాళిన సాంబమూర్తి, ఉర్జాన లక్ష్మణరావు, దవళ లక్ష్మీనారాయణ, వేణుగోపాల్‌, ఉదరు, గౌరమ్మ, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.ఎచ్చెర్ల : సుందరయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అన్నారు. చిలకపాలెం గ్రామంలో అరినామ అక్కివలస నాగార్జున అగ్రికం పరిశ్రమ వద్ద పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా తేజేశ్వరరావు మాట్లాడుతూ సుందరయ్య భూ సంస్కరణలు అమలు కోసం భూ పోరాటాలు సాగించారని, పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై గలమెత్తి వాటి పరిష్కారం కోసం సుందరయ్య పని చేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం తన ఆస్థులు, జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. సమ సమాజం కోసం సుందరయ్య పని చేశారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోనంగి నందోడు, కోరాడ అప్పన్న, వివిధ సంఘాల నాయకులు లింగాల రామప్పడు, రమణ, ఎచ్చెర్ల రాజు, పుట్ట అప్పలనాయుడు, బి.అప్పలరాజు, తోనంగి సుశీల, టి.సూరమ్మ, పి.పార్వతి, కె.బుడ్డోడు, ఆర్‌.కృష్ణ, టి.గోవింద, బి.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.పలాస : సుందరయ్య ఆశయాలు సాధనకు కృషి చేయడం ద్వారా కార్మికవర్గ రాజ్యం స్థాపించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు అన్నారు. కాశీబుగ్గ సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి అధ్యక్షతన సుందరయ్య వర్థంతి సభ ఆదివారం నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో జీడి రైతుల సంఘం జిల్లా కార్యదర్శి టి.అజరుకుమార్‌, సిపిఎం నాయకులు వి.కృష్ణారావు, ఎన్‌.ఢిల్లేశ్వరి, ఎ.వీరాస్వామి, జె.భాగ్యలక్ష్మి, టి.భాస్కరరావు, లావణ్య, కె.గురయ్య పాల్గొన్నారు.మందస : మండలంలోని భైరిసారింగపురంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాల్లర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, ఎం.ధర్మారావు, కె.కేశవరావు, ఆర్‌.దిలీప్‌కుమార్‌, చిరంజీవి, వల్లభరావు, జయరాం, లక్ష్మీనారాయణ, హమాలి సంఘం నాయకులు బి.దుర్యోధన, ఎన్‌.లచ్చయ్య, వెంకటి, నాగేష్‌ పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు : మండలంలోని నగరంపల్లిలో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం నాయకులు నెయ్యిల మోహనరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో నాయకులు బి.ఆనందరావు, ఎస్‌.మనోజ్‌, ఎన్‌.చంద్రయ్య, బమ్మిడి రామకృష్ణ, తమ్మినేని భాస్కరరావు, బి.సుగుణావతి, ఎన్‌.ఈశ్వరమ్మ, ఎన్‌.ధనలక్ష్మి, బి.లక్ష్మి పాల్గొన్నారు. కంచిలి: స్థానిక సిఐటియు కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి సిఐటియు నాయకులు కె.శ్రీనివాసు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, సంగారు లక్ష్మీనారాయణ, ఆశా వర్కర్ల యూనియర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అమరావతి, కె.ప్రేమలత, ఊర్వశి, సుమతి, జ్యోత్స్న పాల్గొన్నారు. రణస్థలం: రణస్థలం సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో వి.లక్ష్మి, మహాలక్ష్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.ఆమదాలవలస: పూజారిపేట లోని ప్రజా ఉద్యమనేత బొడ్డేపల్లి మోహనరావు స్వగృహం వద్ద సుందరయ్య వర్థంతి సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పూర్వపు జిల్లా కార్యదర్శి బొడ్డేపల్లి కనకలక్ష్మి, భవన నిర్మాణ కార్మికులు టి.రాజారావు, పి.తిరుపతిరావు, కె.రమ, కె.కమల తదితరులు పాల్గొన్నారు.

➡️