పలాసలో భారీ చోరీ

కాశీబుగ్గ రోటరీ నగర్‌, పలాస

పరిశీలిస్తున్న క్లూస్‌ టీమ్‌

  • 40 తులాల బంగారం, రూ.18 వేల నగదు అపహరణ

ప్రజాశక్తి- పలాస

కాశీబుగ్గ రోటరీ నగర్‌, పలాస ఐటిఐ రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న పలాస ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్‌ చాప అలివేణి ఇంట్లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో 40 తులాల బంగారం ఆభరణాలు, రూ.18 వేలు నగదును దొంగలు అపహరించారు. బాధితురాలు, కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అలివేణి తన విధుల్లో భాగంగా గురువారం మండలంలోని అమలకుడియా ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ… తన కన్నవారు నందిగాం మండలం హరిదాసుపురానికి వెళ్లారు. అలాగే ఆమె ఇంటి ఎదురుగా ఉన్న వారూ ఇంటికి తాళం వేసి వేరే ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇంటి ఎదురుగా ఉన్న వారు శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చే సరికి అలివేణి ఇంటి తలుపులు తీసి ఉండడం చూసి స్థానికులు ఆమెకు సమాచారం అందించారు. హుటాహుటిన అలవేణి ఇంటికి వచ్చి చూశారు. ఇంటికి వేసిన రెండు తాళాలు, బీరువా పగల కొట్టి బీరువాలో ఉన్న 40 తులాల బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.18 వేలు నగదును అపహరించినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. అలివేణి ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూండగా, భర్త శ్రీనివాసరావు సిఆర్‌పిఎఫ్‌లో పనిచేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత దొంగలు ఇంటికి తాళం వేసిన విషయాన్ని గుర్తించి తాళాలు చాకచక్యంగా పగలుగొట్టారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌ రూమ్‌లోని బీరుతా తాళాలు వెతికి పట్టుకున్నారు. అనంతరం ఆ తాళాలతోనే బీరువా తెరిచి అందులో ఉన్న బంగారం, నగదు దొంగిలించి ఉడాయించారు. సుమారు గంట పాటు ఇంట్లో చక్కబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘ టన స్థలానికి ఎస్‌ఐ పారినాయుడు, క్లూస్‌ టీమ్‌తో చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మొత్తం వేలి ముద్రలు సేకరించారు. చుట్టు పక్కల సిసి కెమెరాలను పరిశీలించారు. దొంగతనం జరిగిన ఇంటికి వంద అడుగుల దూరంలో ఓ సిసి కెమెరా ఉన్నట్లు గుర్తించి అందులో నిర్లిప్తమైన సమాచారాన్ని సేకరిస్తున్నా రు. ఇదిలాఉంగా దొంగతనం జరిగిన ఇంటికి ఎదురుగా నివాసం ఉన్న వారూ ఎవరూ లేని విషయాన్ని దొంగలు గుర్తించి తాళాలు పగలు కొట్టేందుకు ప్రయత్నం చేసిన విఫలయత్నం చేశారు. అయితే చుట్టు పక్కల అలికిడి కావడంతో దొంగలు ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. లేకుంటే ఆ ఇంటినీ దొంగలు కన్నం వేసేవారని పోలీసులు చెబుతున్నారు. రాత్రులు రోటరీనగర్‌, ఐటిఐ రోడ్డులో నిర్మానుష్యంగా ఉంటుం ది. ఈ కారణంగానే దొంగతనం చేయ డానికి సులువైందనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు అలివేణి ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్‌ఐ పారినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️