మార్ట్‌ ఏర్పాటుకు నాబార్డు కృషి

నాబార్డు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి ఎపి ప్రాంతీయ కార్యాలయం

మాట్లాడుతున్న వరప్రసాద్‌ కుమార్‌

ప్రజాశక్తి- రణస్థలం

నాబార్డు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి ఎపి ప్రాంతీయ కార్యాలయం అమరావతి ఆర్థిక సహకారంతో యూత్‌ క్లబ్‌ బెజ్జిపురం ఆధ్వర్యంలో రణస్థలం, లావేరులో జెఆర్‌.పురం, తాళ్ళవలస గ్రామాల్లో 60 మంది స్వయంశక్తి సంఘ మహిళలకు చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు తయారీ 20 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం స్థానిక దేవీశ్రీ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్‌ కుప్పిలి వరప్రసాద్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ విజయవంతం చేసిన మహిళలకు అవసరమైన పెట్టుబడి నిమిత్తం స్థానిక బ్యాంకులకు అనుసంధానం చేస్తూ వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్‌ చేసుకునేందుకు రూరల్‌ మార్ట్‌ ఏర్పాటుకు నాబార్డు ద్వారా కృషి చేస్తామన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అలాగే యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు మేడూరి ప్రసాదరావు మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు తమ సంస్థ ద్వారా మార్కెటింగ్‌ చేయుటకు సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ, శిశు సంక్షేమ శాఖలతో మాట్లాడి పిల్లలకు చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు అందజేయుటకు అవసరమైన కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిసిసిబి సూపర్‌వైజర్‌ పోలినాయుడు, యూత్‌ క్లబ్‌ కోశాధికారి గంట్యాడ అప్పలనాయుడు, అడ్వయిజరీ బోర్డు మెంబర్‌ మేడూరి శేషగిరిరావు, సిబ్బంది నున్నా శ్రీనివాసరావు, లక్షణరావు, దుర్గారావు, అప్పన్న పాల్గొన్నారు.

 

➡️