పండుటాకుల పింఛను పాట్లు

పండుటాకులకు పింఛను పాట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద

బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్న పింఛనుదారులు

ప్రజాశక్తి- పలాస

పండుటాకులకు పింఛను పాట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. దూరప్రాంతాల నుంచి పింఛన్లు తీసుకు నేందుకు బ్యాంకులకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు తప్పడం లేదు. పలాస, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు తదితర మండలాల నుంచి రెండో రోజు వితంతువులు, వృద్ధులు పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం పింఛన్లు పంపిణీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో సుమారు 10 కిలోమీటర్లు దూర ప్రాంతం నుంచి పలాస స్టేట్‌ బ్యాంక్కు వస్తున్నామని, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బ్యాంకుల వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ఎండ, మరో వైపు ఆటోలకు, బస్సులకు కాపలాకాస్తూ పలాస స్టేట్‌ బ్యాంకుకు వస్తున్నామని వాపోయారు. అధికారు అనాలోచిత నిర్ణయాల వల్ల వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదన్న వాదన జోరుగా వినిపిస్తుంది. అధికారుల చొరవ చూపి వచ్చే నెలలో రావాల్సిన పింఛను డబ్బులు నేరుగా పంపిణీ చేయాలని పింఛనుదారులు కోరుతున్నారు.

 

➡️