ప్రజల సహకారంతో ప్రశాంత ఎన్నికలు

ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలు

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – టెక్కలి, శ్రీకాకుళం

ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరమని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక అన్నారు. టెక్కలి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. రాజ్యాంగం కల్పించే ఓటు హక్కును ఎన్నికల్లో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని, వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని, 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఒకేచోట ప్రజలు గుమిగూడి ఉండకూడదని సూచించారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలని చెప్పారు. వంద మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా వేరే వ్యక్తులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఓటు వేసిన అనంతరం బయట ప్రదేశాలు తిరగరాదన్నారు. వివాదాలకు పాల్పడితే చర్యలు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డిఎస్‌పి డి.బాలచంద్రారెడ్డి, ట్రైనీ డిఎస్‌పి సిహెచ్‌.రాజా, సిఐ పైడయ్య ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.సమన్వయంతో విధులు నిర్వహించాలిశ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గోనున్న మాజీ సైనికోద్యోగులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పోలింగ్‌ రోజున నిర్వర్తించాల్సిన విధి విధానాలు, పాటించాల్సిన నిబంధనలపై జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి ఎస్‌పి రాధిక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల భద్రతా సిబ్బందితో సమన్వయంతో విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. కాన్ఫరెన్స్‌లో ఎఎస్‌పి జి.ప్రేమకాజల్‌, జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, ఎన్‌సిసి కమాండెంట్స్‌, కో-ఆర్డినేటర్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, మాజీ సైనికోద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

➡️