వరి విత్తనాలు పంపిణి సిద్ధం

టెక్కలి సబ్‌ డివిజన్‌

మాట్లాడుతున్న జెడి శ్రీధర్‌

ప్రజాశక్తి – టెక్కలి రూరల్‌

టెక్కలి సబ్‌ డివిజన్‌ పరిధిలో రైతులకు 36 వేల క్వింటాల వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌ తెలిపారు. స్థానిక వ్యవసాయశాఖ ఎడి కార్యాలయంలో వ్యవసాయ అధికారులు, డీలర్లతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాల మొలక శాతం పరీక్షించాలని, ప్రతి రైతుకు బిల్లు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఎడి బి.వి తిరుమలరావు, ఎఒ గురుగుబెల్లి రంగారావు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️