నేడు పల్స్‌పోలియో

అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఆదివారం

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. అలాగే సోమ, మంగళవారాల్లో మాపప్‌ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేయనున్నారు. జిల్లాలో 1,79,984 మంది ఐదేళ్లలోపు వయసుగల పిల్లలు ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తించారు. వారి కోసం 1232 పోలియో బూత్‌లు, 50 ట్రాన్సిట్‌ బూతులు ఏర్పాటు చేశారు. అలాగే 78 మొబైల్‌ టీములు, 121 సూపర్‌వైజర్‌ బృందాలుగా ఏర్పడి కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి 3,12,000 డోసులు పోలీయో చుక్కలను సిద్ధం చేశారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో బూత్‌లను ఏర్పాటు చేసి ఆరోగ్య కార్యకర్తలు, ఆశ, అంగన్వాడీ, పాఠశాలల ఉపాధ్యాయులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. మొబైల్‌ టీములు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని సంచార జాతుల వారి పిల్లలకు, ఇటుక బట్టీలు నిర్వహించే వారి పిల్లలకు, నిర్మాణ స్థలాలు, మత్స్యకార గ్రామాల్లో వంద శాతం లక్ష్యంగా విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి.మీనాక్ష్మి ప్రారంభించి పోలియో చుక్కలు వేయనున్నారు.

➡️